కీర్తి సురేష్ నటిస్తున్న గాంధారి వీడియో సాంగ్ వైరల్..!!
ఈ వీడియో గురించి ఆన్లైన్లో ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు తన హృదయానికి చాలా దగ్గరగా ఉన్నట్లు గా కీర్తి సురేష్ తెలియజేసి. ఎట్టకేలకు కొద్ది నిమిషాల క్రితమే ఈ ఈ వీడియోని విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో కీర్తి సురేష్ డాన్స్ లు అంచనాలకు పూర్తి న్యాయం చేసిందని చెప్పవచ్చు. కీర్తి సురేష్ మూవీస్ వీడియో సాంగ్ లో ఎంతో ట్రెడిషినల్ గా కనిపించింది. తనదైన అమాయకంగ క్యూట్ నెస్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే లా కనిపిస్తుంది. జానపద నృత్యా కారుని గా కీర్తి సురేష్ మరొక లెవల్ పైకెదిగిన అని చెప్పవచ్చు.
ఒక కోణం నుంచి చూస్తే ఈ ముద్దుగుమ్మ మహానటి సావిత్రి పోలికలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మ్యూజిక్ ఆల్బమ్ కి కొరియోగ్రాఫర్ గా బృందా మాస్టర్ దర్శకత్వం వహించడం జరిగింది. ఇక గాంధారికి పవన్ సిహెచ్ సంగీతం అందించడం జరిగింది.. సోనీ మ్యూజిక్ వారు ఈ పాటను విడుదల చేశారు. ఇక జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ మొదటిసారిగా ఈ మ్యూజిక్ వీడియోలో నటించింది. దీంతో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.