దీప్తిలో షణ్ముఖ్ ను మిస్సయిన బాధ కనిపించట్లేదే.. ఎంత ఆనందంగా ఉందో చూడండి?

praveen
మొన్నటివరకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ గురించే చర్చ జరిగింది. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఇద్దరూ ఒక్కసారిగా విడిపోతున్నట్లు ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇక వీరిద్దరూ విడిపోవడానికి బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరితో కాస్త క్లోజ్గా ఉండడమే అన్నది అందరూ అనుకుంటున్న మాట. అంతేకాదు ఎంతో ప్రేమగా ఉండే ఈ జంటను బిగ్ బాస్ విడదీసింది అంటూ బిగ్బాస్ కార్యక్రమాన్ని కూడా తిట్టిపోశారు ఎంతోమంది అభిమానులు. ఇక బ్రేకప్ తర్వాత వీరిద్దరి గురించి కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో చర్చ జరిగింది.



 ఇకపోతే వీరిద్దరికీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు చూసుకుంటే దీప్తి సునైనా షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత అతన్ని పూర్తిగా మర్చిపోయింది  అని అర్థమవుతుంది. దీప్తి సునయన తెగ ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను షాక్కు గురి చేస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో దీప్తి షేర్ చేస్తున్న డాన్స్ వీడియోలు సోషల్ మీడియా ను షేక్ చేస్తూ భారీగా వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇటీవల దీప్తి సునైనా తిలానే తిలానే అనే పాటకు డాన్స్ చేసింది. సంతోషంగా ఈ పాటకు డాన్స్ చేస్తూ ఉండటం చూసిన నెటిజన్లు ఇక దీప్తి షణ్ముఖ్ ని పూర్తిగా మరిచిపోయిందని అతడు మిస్సయిన బాధ ఆమెలో ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు.Your browser does not support HTML5 video.

 అయితే షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంది దీప్తి సునైనా. బ్రేకప్ బాధలో మునుపటిలా దీప్తి యాక్టివ్గా ఉండ లేదు అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఐ యాం బ్యాక్ అనే రేంజ్ లో వీడియోలు చేయడం మొదలుపెట్టింది దీప్తి సునయన. స్నేహితులతో పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చేయడం ఇక వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతుంది. షణ్ముఖ్ జస్వంత్ మాత్రం ఎప్పటిలాగానే సైలెంట్గా ఉండి పోయాడు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: