తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ హీరోయిన్ గా రాణిస్తోంది ఐశ్వర్య రాజేష్.. ఇక తన ఫ్యామిలీ కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నది.. అయితే ఎన్నో కష్టాలు పడుతూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.. అయితే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ తన నటనతో ప్రేక్షకులను మైమరపించేలా చేస్తోంది ఐశ్వర్య. ఇప్పుడు తాజాగా మరొక మలయాళం మూవీ ని తమిళ్ లో నటించేందుకు సిద్ధమైంది వాటి గురించి చూద్దాం.
మలయాళంలో మంచి సక్సెస్ సాధించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్.. ఈ సినిమా ని తమిళం లో నటించేందుకు ఈమె ఒప్పుకున్నట్లు గా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా గతంలో విడుదలైంది.. ఇక మలయాళంలో నటి నిషా సజయన్ పాత్రలో ఈమె నటించబోతోందని వార్త వినిపిస్తోంది. ఇక డైరెక్టర్ R. కన్నన్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులను బాలసుబ్రమణ్యం, సినిమాటోగ్రఫీ లియో జాన్ పాల్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని వంటింట్లోని పరిమితమైన కొంత మంది స్త్రీలు ఎలా ఉంటారో అనే ఉద్దేశంతోనే ఈ సినిమా కథను తెరకెక్కించడం జరిగిందట. అయితే ఈ సినిమా ఇప్పుడు తమిళంలో తెరకెక్కించబోతున్నారు.
ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా హీరో ఆర్య తన సోషల్ మీడియా ద్వారా గతంలో విడుదల చేశాడు. దీంతో చిత్రబృందం మొత్తానికి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాని హిందీలో కూడా హర్మాన్ బావేజా , సన్యా మల్హోత్రా నటించనున్నారు. ఇక మలయాళం హిట్ అయిన ఈ సినిమా.. హిందీలో ని తమిళ్ లో ఎలా ఉండబోతోందో అంటు అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇక ఈ సినిమా నుంచి ఏదైనా పూర్తి సమాచారం కావాలంటే చిత్ర బృందం తెలియజేయాల్సిందే..