బిగ్ బాస్ ఓటిటి.. ఫస్ట్ లుక్.. హౌస్ చూసారా?
బిగ్ బాస్ హౌస్ లో ఉండే కాంట్రవర్సీలే ఇక ఈ కార్యక్రమానికి క్రేజ్ రావడానికి కారణం అయ్యాయి అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు కేవలం ఒక గంట మాత్రమే బిగ్బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. ఇప్పుడు మాత్రం రోజులో 24 గంటల పాటు ప్రసారం చేయడానికి సరికొత్తగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే టెలివిజన్ వేదిక గా కాకుండా ఓ టిటి లో బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. ఇటీవల బిగ్బాస్ ఓటీటి సీజన్ కు సంబంధించిన ప్రోమో విడుదలై వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి డిస్నీ హాట్ స్టార్ వేదికగా బిగ్ బాస్ ఓటిటి ప్రారంభం కాబోతుంది. ఇటీవలే బిగ్బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ లుక్ పేరుతో ఒక వీడియోని విడుదల చేయగా ఇది వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో లో భాగంగా బిగ్బాస్ కొత్త హౌస్ తో పాటు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంత మంది ఉంటే ఇక కొత్తగా కొంతమంది కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళ పోతున్నారూ అంటే ఎంతో మంది పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.