తెరపైకి బప్పీ లహరి బయోపిక్.. హీరో ఎవరంటే..?

Anilkumar
బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు బప్పీ లహరి కన్నుమూసిన విషయం తెలిసిందే.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బప్పిలహరి బాలీవుడ్ లోనే కాక తెలుగు, మరికొన్ని భాషల్లో కూడా చాలా చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు.తెలుగులో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ని అందించాడు బప్పిలహరి అందించాడుకాగా బప్పీ అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స తీసుకుంటూనే బప్పీ లహిరి మంగళవారం రాత్రి మరణించడం జరిగింది.

ఇక టాలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.అయితే బాలీవుడ్ లో బయోపిక్ లు ఎక్కువగా తీస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.కాగా గతంలోనే బప్పీ లహరి బయోపిక్ తెరకెక్కించాలనుకున్నారట. అయితే బప్పిలహరి గతంలో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది అయితే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా చాలామంది తన తన జీవిత కథను బయోపిక్ తీయడానికి  సంప్రదించారని, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అంతేకాకుండా దీంతోపాటు ఒకవేళ తన బయోపిక్ తీస్తే..

 తాను యువకుడిగా ఉన్నప్పటి పాత్రని బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ పోషిస్తే బాగుంటుందని తెలిపారు.కాగా ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన మరణించడంతో బాలీవుడ్ నిర్మాణ సంస్థలు బప్పీ లహరి బయోపిక్ తెరకెక్కించడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. అయితే బప్పీ లహరి ఆశించినట్లు రణవీర్ సింగ్ హీరోగా నటిస్తారా లేక వేరే ఎవరైనా నటిస్తారా చూడాలి.ఇక అటు రణవీర్ సింగ్ కూడా ఈ బయోపిక్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయిఇక బప్పీ లహరి బయోపిక్ ని కచ్చితంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: