ఇండియన్ ఐడల్ కి జడ్జిగా పవన్ హీరోయిన్..!

Satvika
నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్నో సినిమా లలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విభిన్న పాత్రలలో నటించి బాగా ఫెమస్ అయ్యింది. ఈమె నటన యువతను ఎక్కువగా ఆకట్టుకుంటూ వస్తుంది. అందుకే ఈమెకు యూత్ ఫ్యాన్స్ ఎక్కువగా వున్నారు. ఉంగరాల జుట్టు,క్యూట్ స్మైల్, బబ్లీ గర్ల్ అందుకే నిత్యామీనన్ తో ఎ హీరో సినిమా చేయాలనీ అన్న ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు..  కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు సింగర్ గా కూడా తన సత్తాను ఛాటుథుంది.. ఎన్నో సినిమాలకు తన గొంతును అందించింది. అయితే ఇప్పటివరకు హీరోయిన్ గా, సింగర్ గా కనిపించిన అమ్మడు ఇప్పుడు జడ్జీగా వ్యవహరిస్తుంది..


అమ్మడు కొత్త అవతారం ఎత్తనుంది. ఒక సింగింగ్ షో కి జడ్జి గా వ్యవహరించనుంది అని తెలుస్తోంది. అది కూడా తెలుగు ప్రేక్షకుల కోసం సంగీత అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటిటీ ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సింగింగ్ షో కి నిత్యా మీనన్ జడ్జి గా రానున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో ఆహా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ముఖం కనిపించకుండా అందులో కేవలం నిత్యను చూపించారు.


కొత్త జడ్జిగా రానున్న సింగింగ్ సెన్సేషన్ ఎవరు గెస్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు.. ఆ వీడియో ను చూసిన ఎవరికైనా ఆ వీడియో లో నిత్య ఉందని అంటారు. అంత క్లియర్ గా కొత్త జడ్జిగా నిత్యా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.మెలోడీ పాటల బంగారం ఆమె గాత్రం అంటూ నిత్యా గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.ఇప్పటివరకు ఈ కుర్ర హీరోయిన్ నిత్య ఎ షో కి రాలేదు.. ప్రస్తుతం వస్తున్న భారీ హిట్ అవుథుందని ఆహా టీమ్ అభిప్రాయా పడుతూంది..మరి నిత్య ఎ విధంగా షో లో అలరిస్తుందొ చూడాలి.. ఆ ప్రోమోను మీరు కూడా ఒకసారి చూడండి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: