అనసూయ కు ఇంత డిమాండ్ ఏంటి బాసూ..!!

P.Nishanth Kumar
బుల్లితెరపై యాంకర్ గా హవా చూపిస్తూనే అనసూయ వెండితెరపై నటి గా దూసుకుపోతుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో ఆమె మంచి మంచి పాత్రల్లో కనిపించగా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల అవకాశాలు అందుకోవడం విశేషం. ఇటీవల కాలంలో తెలుగు లో వస్తున్న ప్రతి సినిమాలో కూడా ఈమె కనిపిస్తూ ఉండడం తో ఆమెకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్ ను నిలబెట్టుకుంటున్న అనసూయ ఇప్పుడు మరో పెద్ద అవకాశాన్ని అందుకోబోతుంది.
ఆమె నటించిన ఖిలాడి సినిమాలోని చంద్రకళ పాత్ర కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా లో ఆమె నటించిన తీరుకు అందరు కూడా ఫిదా అయిపోయారు. ఈనేపథ్యంలో ఆమె మరోసారి మెగా స్టార్ సినిమాలో కనువిందు చేయనుంది. చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ పోతున్నాడు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమాల్లో అయన చేస్తున్నారు. అయితే భోలా శంకర్ సినిమా లో అనసూయ ఓ కీలక పాత్ర లో కనిపించనున్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే ఆచార్య సినిమా లో ఆమె ఓ కీలక పాత్ర లో నటిస్తుంది. అయితే ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వనే లేదు. అప్పుడే మళ్ళీ ఇంకో మెగా సినిమా లో అవకాశం రావడం అంటే నిజంగా ఆమె అదృష్టం అనే చెప్పాలి. ఆచార్య సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతుండగా ఆ సినిమా లో ఈమె పాత్ర కు మంచి పెరోస్తుందని భావిస్తుంది.  ఈనేపథ్యంలో ఆమె కు టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగిపోవడం ఆమె అభిమానులను ఎంతో సంతోష పెడుతుంది. భవిష్యత్ లో ఆమె ఇంకా మంచి మంచి సినిమాల్లో పాత్రల్లో నటించి అందిని అలరింప చేయాలనీ భావిస్తున్నారు. మరో ఈ రెండు సినిమాలతో అనసూయ ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: