మాల్దీవుల్లో పూజా హెగ్డే.. ఏం చేస్తుందో చూడండి?
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది పూజా హెగ్డే . అంతేకాకుండా తమిళ్ లో ఇలా దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవగా విడుదలకు సిద్ధమవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే అరబిక్ కుతూ అనే లిరికల్ వీడియో విడుదలైంది. వాలెంటెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మరోసారి అదరగొట్టాడు అద్భుతమైన మ్యూజిక్ అందించడమే కాదు ఈ పాటలను తానే స్వయంగా పాడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అందరి దృష్టిని సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియా లో దూసుకుపోతు ఉండగా ఇక తాజాగా మాల్దీవులు టూర్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే ఈ సినిమాలోని అరబిక్ కుతూ సాంగ్ పై స్టెప్పులు వేసి రచ్చ చేస్తుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇకపోతే ఇప్పటికే ఆచార్య, బీస్ట్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతుంది ఈ సొగసరి.