పవన్ సరసన చాన్స్ కొట్టేసిన ఖిలాడి బ్యూటీ..?

Anilkumar

గద్దలకొండ గణేష్‌' సినిమాలో హీరోయిన్‌గా చేయాల్సిన ఈమె... కొన్ని అనుకోని కారణాల వల్ల ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. అయితే ఇదంతా డింపుల్‌ హయాతి గురించే.ఇటీవల 'ఖిలాడీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ .ఈమె అందాల ప్రదర్శన విషయంలో 'తగ్గేదేలే' అంటూ అదరగొట్టింది.  ఆమె అందం విషయం పక్కనపెడితే స్క్రీన్‌ అప్పీయరెన్స్‌ విషయంలో కాస్త తక్కువ మార్కులే పడ్డాయి. అయితే  పవన్‌ కల్యాణ్‌ సినిమాలో మార్కులు కొట్టేసిందా? అంటే  అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.  ఇక తాజా సమాచారం ప్రకారం రీఎంట్రీలో భాగంగా ఐటెమ్‌ సాంగ్‌ ఛాన్స్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్ సినిమాలో డింపుల్‌ హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసిందట.

పవన్‌ కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'భవదీయుడు భగత్‌సింగ్‌' అనే సినిమా రానున్న విషయం అందరికీ తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.అయితే  ఈ సినిమాలోనే ఓ నాయికగా డింపుల్‌ హయాతీ ఛాన్స్‌ సంపాదించింది అంటున్నారు.  ఇక ఇప్పటికే ఈ సినిమాకి పూజా హెగ్డే ను నాయికగా అనుకున్నారు. అయితే ఇప్పుడు డింపుల్ హయాతి రెండవ హీరోయిన్ అన్నమాట. ఇక ఇదిలా ఉంటే నిజానికి 'ఖిలాడీ' సినిమా విడుదలకు ముందు డింపుల్‌ ఓకే చేసిన కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి.అయితే గోపీచంద్‌ - శ్రీవాస్‌ సినిమాలో నాయికగా డింపుల్‌ హయాతీనే అనుకున్నారట.

 ప్రస్తుతం మాత్రం ఆ సినిమా నుండి ఆమెను తప్పించారని వార్తలొస్తున్నాయి. ఇక ఈలోగానే పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఓకే అయ్యిందని వార్తలు రావడం ..తన కెరీర్‌కు పెద్ద బూస్టే అని చెప్పొచ్చు. పవన్‌ సినిమాలో ఓకే అయ్యిందంటే అది తన అదృష్టమనే చెప్పాలి.అయితే ఒకవేళ పవన్‌ సినిమా ఓకే అయ్యింది అంటే. వరుస సినిమాలు సైన్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ విషయం నిజమా కాదా అన్నది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాలి. అయితే ఇదిలా ఉంటే ఐటెమ్‌ సాంగ్‌ ఆమెకు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇప్పించిన హరీశ్‌ శంకర్‌ నాయికగా రీఎంట్రీ ఇప్పిస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

Ali

సంబంధిత వార్తలు: