హీరోలను టార్గెట్ చేసిన చిరంజీవి..!

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస బెట్టి క్రేజీ సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే, అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశాడు.  ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చిరంజీవి, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు,  ఈ సినిమాతో పాటు బోలా శంకర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ లలో కూడా చిరంజీవి పాల్గొన్నాడు.


ఇలా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాల విషయంలో టాలీవుడ్ హీరోలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది, ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అయిన సత్య దేవ్ ను చిత్ర బృందం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే బోలా శంకర్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అయిన నాగ సౌర్య ను తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు బయటకు వచ్చాయి, ఇది మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజ ను తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇలా మెగాస్టార్ చిరంజీవి వరస పెట్టి ప్రతి సినిమాలోనూ ఎవరో ఒక హీరోను తన సినిమాలో ఉండేటట్లు చూస్తున్నట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన వెంకీ కుడుముల  దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: