బంగార్రాజు సినిమా ఓటిటి స్ట్రీమింగ్ అప్పుడు...అక్కడో తెలుసా..?

Pulgam Srinivas
ప్రేక్షకులు ప్రస్తుతం ఓటిటి వేదికలపై మక్కువ ఎక్కువగా చూపిస్తున్నారు, ప్రస్తుతం ఉన్న కారోనా పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్లి సినిమాను చూడడం కంటే ఇంట్లో కూర్చొని కుటుంబమంతా కలిసి ఏదైనా ఒక ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో సినిమా చూడటం మంచిది అని కొంతమంది ఆలోచిస్తూ ఉండటం తో ఓటిటి ప్లాట్ ఫామ్ లకు  డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇలా ఓటిటి ప్లాట్ ఫామ్ లకు డిమాండ్ భారీగా పెరిగిపోవడంతో ఓటిటి సంస్థల మధ్య కూడా పోటీ విపరీతంగా పెరిగిపోయింది, ఈ పోటీ నేపథ్యంలో ఓటిటి సంస్థలు స్వతహాగా కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించి స్ట్రీమింగ్  చేస్తున్నారు.  


అలాగే కొన్ని సినిమాలను నేరుగా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేస్తూ సినీ ప్రేక్షకుల నుండి మరింత రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి, ఇది మాత్రమే కాకుండా సినిమా విడుదలకు ముందే ఈ సినిమా విడుదల అయిన ఎన్ని రోజులకు ఓటిటి లో స్ట్రీమింగ్ చేయాలి అనే దానిపై కూడా సినిమా నిర్మాతలతో ఓటిటి సంస్థలు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అందులో భాగంగా కొన్ని సినిమాలు అతి తక్కువ కాలంలోనే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటే మరికొన్ని సినిమాలు కొంత ఆలస్యంగా ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి, ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమా కూడా ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో నటించాడు, ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయంగా నిలిచింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ఫిబ్రవరి 18 వ తేదీ నుండి జీ ఫైవ్ ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది, ఈ విషయాన్ని తాజాగా జీ ఫైవ్ నిర్వహణ బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: