టాలీవుడ్లో 1996వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రేమ దేశం' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసి సంచలన విజయాన్ని అందుకుంది బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా పెట్టిన దానికి మూడు రెట్లు లాభాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా టీవీ లో వసస్తే ఆడియన్స్ అతుక్కుపోయి మరి చూస్తుంటారు. అంతలా ఈ సినిమా జనాలను ఆకట్టుకుంది. సినిమా లో అబ్బాస్, వినీత్ హీరోగా నటించగా హీరోయిన్ పాత్రలో టబు అద్భుతమైన నటనను కనబరిచింది.
ఒకే ఒక్క సినిమాతో అబ్బాస్ కి అటు వినీత్ కి మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా అబ్బాస్ మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు.ఈ సినిమాతో అబ్బాస్ కి వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.అప్పట్లో ఎక్కడ చూసినా అబ్బాస్ హెయిర్ స్టైల్ తెగ ఫాలో అయ్యేవారు. ఇప్పటికికూడా అబ్బాస్ హెయిర్ స్టైల్ ని ఫాలో అవుతున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ అతనికి ఎలాంటి సినిమాలు పెంచుకోవాలో తెలియక అనవసరమైన క్యారెక్టర్ ఉన్న పాత్రలు సెలెక్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ కి సైన్ చేసుకుంటూ పోయాడు.
ఫలితంగా అతనికి వరస ప్లాప్ లు వెంటాడాయి. దాంతో సినిమాల విషయంలో కాస్త వెనుకబడ్డాడు. ఇక ఆ తర్వాత మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించిన అవి అంతగా ఆకట్టుకోలేదు. దీంతో అబ్బాస్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. నిజానికి అబ్బాస్ కెరియర్ ఎంతలా డౌన్ అయింది అంటే చివరికి హార్పిక్ యాడ్లో సైతం నటించేలా డౌన్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో బతకడం కష్టం అనిపించి బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఒక పెట్రోల్ బాంక్ లో పనిచేసి డబ్బులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో అక్కడే స్థిరపడి పోయినట్లు తెలుస్తోంది.తన కెరీర్ బిగినింగ్ లో వచ్చిన ఆఫర్లను ఆలోచించి ఓకే చేస్తే ఈరోజు అబ్బాస్ కెరియర్ మరోలా ఉండేది...!!