నితిన్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన 'గాలోడు'... ?
ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తన తదుపరి ప్రాజెక్ట్ ను కూడా లైన్ లో పెట్టగా... ఆ ప్రాజెక్టు లో సుధీర్ కు ఛాన్స్ దొరికినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో సుధీర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, అతనికి ఈ చిత్రం ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుంది అన్నది చూడాలి. ప్రస్తుతం సుధీర్ గాలోడు అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఓ వైపు టివి ఆర్టిస్ట్ గా, మరో వైపు హీరోగా, ఇంకోవైపు , కో యాక్టర్ గా ఇలా అంది వచ్చిన అవకాశాలను అందుకుంటూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా కెరియర్ లో జోష్ పెంచాడు ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్.
పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న `గాలోడు` చిత్రంలో సుధీర్ కొత్త లుక్ తో కనిపించనున్నారు. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీని ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరి సుధీర్ కి నితిన్ చిత్రంలో వచ్చిన ఛాన్స్ గురించి ప్రస్తుతం అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి త్వరలో దీనికి సంబంధించి ఏమైనా వస్తుందేమో చూడాలి.