RC-15 మూవీకు కథ అందించిన మరొక స్టార్ డైరెక్టర్..!!

Divya
సాధారణంగా తమిళ్ డైరెక్టర్ శంకర్ సినిమాలు అంటే భారీ బడ్జెట్ తో కూడుకున్నవి అని అందరికీ తెలిసిన విషయమే.. ఈ క్రమంలోనే రోబో సినిమా ఎన్ని కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందో మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ 15 వ సినిమాకు శంకర్ దర్శకుడు గా పని చేస్తున్నాడు. కేవలం ఒక పోస్టర్ కు కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి సంచలనం సృష్టించాడు డైరెక్టర్ శంకర్. అందుకే ఈ డైరెక్టర్ తన సినిమాలను రూపొందించాలంటే బడా నిర్మాతలను మాత్రమే ఎంచుకుంటాడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రామ్ చరణ్ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ను ఎంపిక చేసుకున్నాడు.
ఇకపోతే ఈ సినిమాకి కూడా కొన్ని వందల కోట్లు వెచ్చించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక సీక్రెట్ రివీల్ చేయడం జరిగింది.. అదేమిటంటే ఈ సినిమాకు కథను అందించింది ఒక రచయిత కాదు.. ఒక స్టార్ డైరెక్టర్ ఈ సినిమాకు కథను అందించాడు అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు పేట, పిజ్జా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజు. ఈ విషయాన్ని నేరుగా ఒక ఇంటర్వ్యూ ద్వారా కార్తీక్ తెలియచేశాడు. అంతేకాదు ఈ సినిమాకి ప్రధాన కథను తాను రాయగా.. అందుకు తగ్గట్టు డైలాగ్స్ , స్క్రిప్టు శంకర్ సిద్ధం చేసుకున్నాడు అని కార్తీక్ తెలియజేశాడు.
ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో ఆ తర్వాత ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడని బోగట్టా.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూండగా ప్రముఖ కమెడియన్ సునీల్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ సినిమాకు ఏకంగా 250 కోట్ల రూపాయలను వెచ్చించబోతున్నట్లుగా నిర్మాతలు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: