పాన్ ఇండియా కథ కోసం బోయపాటి కసరత్తులు..?

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా అట్టర్ ప్లాప్ అయిన విషయం తెల్సిందే. ఆ సమయంలో బోయపాటి శీను గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి.బోయపాటి కెరీర్ క్లోజ్ అయినట్లే అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కానీ అందరి నోళ్లు మూయిస్తూ బాలయ్య బాబుతో అఖండ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బాలయ్య తో తన మూవీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయం అంటూ బోయపాటి నిరూపించాడు. బాలయ్య.. బోయపాటిల కాంబోకు  మొత్తానికి హ్యాట్రిక్ దక్కింది. అఖండ జోరుతో ఉన్న బోయపాటి శ్రీను ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక అల్లు అరవింద్ స్వయంగా ఆ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లుగా ప్రచారం అనేది జరిగింది. అందుకు సంబంధించిన విషయాలపై కూడా కూడా చర్చలు జరిగాయి.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాను చేసి కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఆ సినిమా తో దక్కించుకున్నాడు. అందుకే బోయపాటి తో సినిమాకు బన్నీ ఎంతగానో ఆసక్తి చూపించారు. ఇక పుష్ప సినిమా తో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప సినిమా తర్వాత ఆయన చేసే అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండబోతున్నాయి.రెబల్ స్టార్ ప్రభాస్ ఎలా అయితే భారీ సినిమాలను ప్లాన్ చేసుకుంటూ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా దూసుకు పోతున్నాడో అదే తరహాలో అల్లు అర్జున్ కూడా ప్లాన్ చేసుకోవాలని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి పుష్ప 2 సినిమా పైనే పూర్తి దృష్టి పెట్టబోతున్న బన్నీ ఆ తర్వాత కూడా పాన్ ఇండియా కథలే కావాలంటున్నాడట. దాంతో బన్నీ కోసం బోయపాటి శ్రీను మంచి పాన్ ఇండియా కథను రెడీ చేస్తున్నాడట. అటు మన సౌత్ ఆడియన్స్ ఇంకా అలాగే నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని బోయపాటి శ్రీను మంచి పాన్ ఇండియా కథ కోసం కసరత్తులు చేస్తున్నాడట. చూడాలి మరి బన్నీ కోసం బోయపాటి ఎలాంటి కథను సిద్ధం చేశాడో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: