సమంత కోసం ప్రత్యేక పాత్ర సిద్ధం చేసిన త్రివిక్రమ్!!

P.Nishanth Kumar
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి ఈ కాంబో లో సినిమా కోసం ఎదురు చూడగా ఇన్ని రోజులకు ఈ కాంబినేషన్ తెరపైకి వస్తుండటం విశేషం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. మహేష్ బాబు హాజరు కాకపోయినా ఆయన సతీమణి ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమాలకు హాజరయ్యింది.

అతడు సినిమా వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా కాగా ఇది ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించింది అనే చెప్పాలి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వీరి కాంబినేషన్ లో ఖలేజా సినిమా వచ్చింది. అయితే ఇది థియేటర్లలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఆ తర్వాత బుల్లితెరపై భారీ స్థాయిలో ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కానీ ఎందుకో ఇద్దరికీ మళ్లీ సినిమా చేయడానికి ఏమాత్రం కుదరలేదు త్రివిక్రమ్ వరుసగా తన సినిమాల్ని చేసుకుంటూ పోవడం తో మహేష్ తో సినిమా చేయడానికి తీరిక లేకుండా పోయింది.

ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం వారి అభిమానులను ఎంతగానో సంతోషపరుస్తుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా త్రివిక్రమ్ కు ఎంతో ఇష్టమైన కథానాయిక సమంత కోసం స్పెషల్ పాత్రను ఆయన రాశారట.  ఈ పాత్ర ను ఇప్పుడే రివీల్ చేయదలచుకోవడం లేదట త్రివిక్రమ్. తొందర్లోనే దీనికి సంబంధించి న వార్త ను బయటపెట్టన్నారట. మరి విడాకుల తర్వాత సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమంత ఈ చిత్రంలో పూర్వవైభవాన్ని తీసుకొచుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె మంచి మంచి ప్రాజెక్ట్ లానే చేస్తూ ఉంది. రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా ఆమె నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: