పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా షూటింగ్ నిన్న పూర్తయింది. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత అయిన ఛార్మి వెల్లడించింది. పూరి జగన్నాథ్ వాయిస్ నోట్ ను తన ట్విట్టర్ లో వెల్లడిస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు ఈ వాయిస్ నోట్ లో జనగణమన ప్రస్తావన కూడా రావడం విశేషం. అలా అలా తను తదుపరి చేయబోయే సినిమాని కూడా అధికారికంగా ప్రకటించాడు పూరీ.
బడ్జెట్ హద్దులు దాటకుండా తక్కువ టైంలో సినిమా చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చి భారీ స్థాయి విజయాలు అందుకునే దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు మంచి పేరుంది. అంతేకాదు నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ ఇప్పటివరకు ఆయన పని చేసిన నిర్మాతలతో ఎంతో మంచి పేరు తెచ్చుకుని హిట్ సినిమాలు చేశాడు. ఇప్పుడు ఎక్కువగా పెద్ద సినిమా లపై శ్రద్ధ పెడుతూ పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అలా లైగర్ సినిమాను కొన్ని రోజుల క్రితం మొదలు పెట్టగా ఇప్పుడు ఆ చిత్రాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించాడు.
ఇక తన తదుపరి సినిమా పై గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి ఆయన వరుసగా తన రెండో సినిమాను విజయ్ దేవరకొండ తో కలిసి చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి అది కూడా ఆయన డ్రీమ్ ప్రాజెక్టు గా చెప్పే జనగణమన సినిమాను విజయ్ దేవరకొండ తో కలిసి చేస్తున్నాడని వార్తలు బాగా వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతోందని బాగానే వార్తలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన చేస్తూ ఆయన ఇప్పుడు దీన్ని ప్రకటించడం అభిమానులను ఎంతో సంతోష పరిచింది. మరి పూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తదో చూడాలి.