లెజెండరీ సింగర్ అయిన లతా మంగేష్కర్ మరణం ఆమె అభిమానులను మరియు కుటుంబ సభ్యులను శోకసముద్రంలో ముంచివేసింది. కరోనా మహమ్మారి లతాజీని మన అందరికీ దూరం చేసింది.
లతాజీ ఈ లోకాన్ని విడిచిపోయినా.. ఆమె పాటల నిధి మాత్రం పదిలంగా ఉంది.మధుర గానంతో ఆమె రోజూ పలకరించనున్నారు. సింగర్ గా తిరుగులేని చరిత్ర లిఖించిన లతాజీ పాటల పల్లకిలో సుదూరాలకు వెళ్లిపోయారు.. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ లో లతా మంగేష్కర్ వేల సంఖ్యలో పాటలు పాడి అలరించారు.. అలాగే దేశంలోని అనేక మంది సింగర్స్ తో కూడా ఆమె గొంతుకలిపారు. ముఖ్యంగా మన తెలుగు గానగంధర్వుడు అయిన ఎస్పీ బాల సుబ్రమణ్యంతో లతాజీకి ప్రత్యేక అనుభందం వుంది. పదుల సంఖ్యలో తెలుగు మరియు హిందీ పాటలు కలిసి పాడారు.
వీరి కాంబినేషన్ లో వచ్చిన పాటల్లో మైనే ప్యార్ కియా మరియు హమ్ ఆప్ కే కౌన్ హై ఆల్బమ్స్ చాలా ప్రత్యేకం. సల్మాన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన ఈ రెండు చిత్రాల సాంగ్స్ అప్పట్లో సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి.ముఖ్యంగా మైనే ప్యార్ కియా మూవీ సాంగ్స్ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ హిట్స్ అని చెప్పొచ్చు.
ఈ రెండు చిత్రాలకు కూడా మ్యూజిక్ రామ్ లక్ష్మణ్ అందించారు. ఆలాగే ఆల్బమ్ లోని మొత్తం పాటలు లతాజీ-ఎస్పీ బాల సుబ్రమణ్యం చేత పాడించారట.. హిందీతో పాటు తెలుగులో కూడా లతాజీ-బాలు కలిసి పాడారు.తెలుగులో ప్రేమ పావురాలు మరియు ప్రేమాయలయం అవే టైటిల్స్ లో విడుదలయ్యాయి. ప్రేమ పావురాలు సాంగ్స్ తెలుగులో కూడా అతిపెద్ద విజయం సాధించింది.. మ్యూజిక్ ప్రియులను దశాబ్దాల పాటు అలరించిన సాంగ్స్ ఎంతో విలువైనవి.. ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపించే ఆ సినిమా పాటలు సినిమా విజయంలో కూడా కీలకంగా మారాయి.
తెలుగులో కూడా ప్రేమపావురాలు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా అలాగే హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రం ప్రేమాలయం టైటిల్ తో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ రెండు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ కాగా లతాజీ-బాలు తమ గాత్రంతో ఎంతో మాయ చేశారు.
ఒక దశలో బాల సుబ్రహ్మణ్యం కి గొంతు సమస్య వచ్చిందట.. డాక్టర్స్ సర్జరీ కు సూచించారు. ఈ విషయాన్నీ లతాజీకి కూడా బాలు చెప్పారట. దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన వాయిస్ పాడవుతుంది సర్జరీ వద్దని లతాజీ సలహా ఇచ్చారని తెలుస్తుంది.. ఆవిడ మాటకు సరే చెప్పిన బాలు ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారట. అంతగా ఒకరినొకరు గౌరవించుకోవడం మరియు వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునేవారట.