ఇక ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే చివరి ఎపిసోడ్ అయిన బాల కృష్ణ మహేష్ బాబు కాంబో ఎపిసోడ్ నిన్నటినుంచి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.అటు బాల కృష్ణ అభిమానులు ఇటు మహేష్ అభిమానులు చాలా రోజుల నుంచి ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ షోలో బాలయ్య సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. షోలో బాల కృష్ణ మాట్లాడుతూ మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని ఇండస్ట్రీ హిట్ ఇస్తారని తేడా వస్తే మాత్రం ఇక డైరెక్ట్ గా అస్సాం రైలు ఎక్కిస్తారని చెప్పుకొచ్చారు.సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సినిమాల్లో ఫైర్ బ్రాండ్ గా కనిపించాడని మరికొన్ని సినిమాలలో సెటిల్డ్ యాక్టింగ్ లో అలరించాడని వేరియేషన్స్ తో మహేష్ బాబు వర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్నాడని బాల కృష్ణ అన్నారు. నిన్ను అభిమానించే వాళ్లలో ఒకడిగా అడుగుతున్నా రియల్ మహేష్ బాబు ఎవరని బాలయ్య అడగగా ఐయామ్ ఏ ఫాదర్ టు మై చిల్డ్రన్ అని సూపర్ స్టార్ మహేష్ బాబు బదులిచ్చారు.
ఆ తర్వాత బాలకృష్ణ తనకు, మహేష్ బాబుకు మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పుకొచ్చారు.ఇక నన్ను ఏ విధంగా నాన్నగారు ఇండస్ట్రీకి తీసుకొచ్చారో కృష్ణగారు కూడా నిన్ను అలాగే తీసుకొచ్చారని బాలయ్య చెప్పగా సూపర్ స్టార్ మహేష్ బాబు అవునని సమాధానం ఇచ్చారు. నాన్న కృష్ణ గారి నుంచి నువ్వు నేర్చుకోవాలని అనుకున్న లక్షణం ఏంటని నేర్చుకోకూడదని అనుకున్న లక్షణం ఏమిటని బాలయ్య మహేష్ బాబును ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ నాన్ననుంచి తాను మంచితనం నేర్చుకున్నానని ఆ మంచితనం కూడా నేర్చుకోకూడదని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. నాన్నలా మరీ అంత మంచితనంతో కూడా ఉండకూడదని తాను భావిస్తానని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు.ఇక ప్రాక్టికల్ గా తాను నాన్న లైఫ్ నుంచి ఇది బాగా నేర్చుకున్నానని సూపర్ స్టార్ మహేష్ బాబు కామెంట్లు చేశారు.