వావ్: లేడీ ఓరియెంటెడ్ మూవీలో..స్టార్ హీరో ..!!

Divya
 బాలీవుడ్ నుంచి కరోనా కాస్త తగ్గిన తర్వాత విడుదల కాబోతున్న పెద్ద సినిమా గంగుభాయ్.. ఇక ఇందులో హీరోయిన్గా ఆలియాభట్ నటిస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ.. ఇక ఈ సినిమాని సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో ఆలియాభట్ మరొక లెవల్లో ఉండబోతోంది అన్నట్లుగా దర్శకుడు కొన్ని సందర్భాలలో తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్స్ , వీడియోలు కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి అభిమానులకు.
ఇక ఇందులో మరొక హీరో అజయ్ దేవగన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక లుక్ ను కూడా తాజాగా విడుదల చేశారు.అయితే ఏ లేడీ ఓరియంటెడ్ మూవీ లో అయినా సరే ఎక్కువగా హీరో కి ప్రాధాన్యత ఉండదని అందరూ అనుకుంటూ ఉంటారు.. కానీ అజయ్ దేవగన్ లుక్ ను ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఈ సినిమాలో ఆయనే హైలెట్గా నిలిచే లా కనిపిస్తుంది. అందుకు సంబంధించి ఈ ఫస్ట్ లుక్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా  ఈ పోస్టర్ విషయానికి వస్తే ఇందులో అజయ్ దేవగన్ కోట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని  నిల్చొని ఉన్నాడు.
ఇక ఈ సినిమా ఈ ఏడాది 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకి విడుదల కాబోతోంది.. ఇక రేపు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమాని కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో సైతం విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు చిత్రబృందం. ఇక తెలుగులో కూడా ఆలియా భట్ కు rrr మూవీతో మంచి క్రేజ్ ఉంది అందుచేతనే ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: