పవన్ కళ్యాణ్ ను ప్రాణంగా భావించే ముగ్గురు యంగ్ హీరోలు వీరే?

VAMSI
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి వేరే చెప్పాలా... రికార్డులు తిరగరాసిన ఈ హీరోకి అభిమానులు కోకొల్లుగా ఉన్నారు. నిజానికి ఈయనకి ఫ్యాన్స్ కాదు అభిమానించే భక్తులు ఉన్నారని చెప్పాలి. సామాన్యులే కాదు ఎందరో సినీ సెలబ్రిటీలను తన ఫ్యాన్స్ గా మార్చుకున్న ఘనత పవర్ స్టార్ అందుకున్నారు. హీరోలు, హీరోయిన్లు, నటులు మాత్రమే కాదు దర్శక నిర్మాతల్లోనూ ఈయనకు వీరాభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే వారెవరో ఒకసారి చూసేద్దామా.
మొదటగా చెప్పుకోవాల్సింది నటుడు, దర్శకుడు కమ్ నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్  పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్. నేను  పవర్ స్టార్ కి ఫ్యాన్ ని కాదు భక్తుడిని, ఆయన నా దేవర అని పలు సందర్భాలలో బండ్ల గణేష్ అన్నారు. ఈయన ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా పవన్ కళ్యాణ్ జపమే చేస్తుంటారు. వీరిద్దరి బంధం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరైన నితిన్ కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఈ విషయాన్ని ఎన్నో సార్లు స్టేజ్ ల పై చెప్పి తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. అంతే కాకుండా తన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ పాటలను వాడటం, ఆయన మ్యానరిజం ను వినియోగిస్తుంటారు నితిన్. మాములుగా ఒక హీరో ఇంకొక హీరోను గౌరవించడం వరకు ఒకే. కానీ ఇలా ప్రాణంగా ఆరాధించడం బహుశా వండర్ అని చెప్పాలి.

 మొదట చిన్న చిన్న సినిమాలతో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకుని, ఇప్పుడు కనీసం గ్యారంటీ హీరోగా మారిపోయాడు నిఖిల్ సిద్దార్ధ్. నిఖిల్ కి కూడా పవన్ కళ్యాణ్ అన్నా ఆయన సినిమాలు అన్నా చెప్పలేం అభిమానం ప్రేమ. తన కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని చాలా సార్లు ఈవెంట్ లలో చెప్పాడు.

 ఇక ఈ మధ్యనే ఒకటి రెండు సినిమాలు చేసి టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం గురించి యూత్ కి బాగా తెలుసు. తాజాగా హీరో కిరణ్ అబ్బవరం నటించిన  "సెబాస్టియన్ పీసీ 524"  భీమ్లా నాయక్ సినిమా రోజునే రిలీజ్  సమయం లోనే విడుదల అవుతుండగా.... పవన్ అభిమానులు కిరణ్ ను నిలదీస్తూ ఆరోజు పవన్ సినిమా ఉందని తెలీదా. మరి మీ సినిమా ఎలా రిలీజ్ చేస్తున్నావా అని అడుగగా... అందుకు స్పందించిన కిరణ్ మీకంటే ఇంకాస్త ఎక్కువనే వెయిట్ చేస్తున్నాను పవర్ స్టార్ "భీమ్లా నాయక్" కోసం. నా  మూవీ ఉన్నా సరే నేను మాత్రం, ఫస్ట్ డే ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీ లోనే" అంటూ తన అభిమానాన్ని మరోసారి తెలియచేశాడు హీరో కిరణ్ అబ్బవరం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: