వలిమై రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది..!

Pulgam Srinivas
ఇండియా వైడ్ గా ఎన్నో క్రేజీ సినిమాల విడుదల తేదీలను ప్రకటించి ఆ తర్వాత దేశంలో  కరోనా విజృంభించడంతో ఆ సినిమాలలో చాలా సినిమాల విడుదలను చిత్ర బృందాలు వాయిదా వేశాయి,  ఇది ఇలా ఉంటే ఇండియా రేంజ్ లో క్రేజ్ వున్న ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాల కొత్త  విడుదల  తేదీలను తాజాగా చిత్ర బృందాలు ప్రకటించాయి, వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య ఈ సినిమా విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించింది, ఇది ఇలా  ఉంటే తాజాగా అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై సినిమా విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించింది.  ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి, ఈ సినిమాపై కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


 ఇలా ప్రేక్షకుల మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను  జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది, అయితే ఆ తర్వాత దేశంలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, ఈ మూవీ లో  అజిత్ సీబీసీఐడీ అధికారిగా కనిపించనున్నాడు, మరి ఈ సినిమాతో అజిత్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అనుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: