ఆ స్టార్ హీరో పక్కన హీరోయిన్ చాన్స్ కొట్టేసిన రాశీఖన్నా..?

Anilkumar
టాలీవుడ్ లో హీరోయిన్ గా భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాశిఖన్నా కూడా ఒకరు.. కెరీర్ మొదట్లో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి.. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. ఇటీవల విజయ్ దేవరకొండ సరసన నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత రాశి ఖన్నా కి అవకాశాలు తగ్గినట్టు కనిపించాయి. దాంతో ఈ భామ కాస్త సోషల్ మీడియాలో బిజీ అవుతూ హాట్ హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొంటూ వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ ఇప్పుడు అవకాశాలు దక్కించుకుంది. తాజాగా ఈ అమ్మడికి టాలీవుడ్ లో మళ్లీ వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే గోపీచంద్తో 'పక్కా కమర్షియల్' అలాగే నాగచైతన్యతో 'థాంక్యూ' సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిన రాశిఖన్నా.. అటు తమిళంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తోంది.

ముఖ్యంగా తమిళంలో ఈ అమ్మడి చేతిలో నాలుగు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు హిందీలో యోధ మూవీ అలాగే రెండు వెబ్ సిరీస్ ల తో బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఇవే కాకుండా తాజాగా ఈ అమ్మడు ఖాతాలో మరో పెద్ద సినిమా వచ్చి పడింది. అది కూడా అ ఓ బడా స్టార్ హీరో సినిమాలో కావడం విశేషం. ఇక ఆ వివరాల్లోకి వెళితే... టాలీవుడ్  లో ఇటీవల మహర్షి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఓ బై లింగువల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది.

ఇక ప్రస్తుతం విజయ్ 'బీస్ట్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే వంశీ పైడిపల్లి మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నా ఎంపిక అయిందట. విజయ్ కి తమిళంలో సుమారు 200 కోట్ల మార్కెట్ ఉంది. ఇక తెలుగులో కూడా ఈ హీరోకి సుమారు 15 నుంచి 20 కోట్ల మార్కెట్ ఏర్పడింది. ఇలాంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈమె కెరీర్ ఒకసారి చూసుకుంటే ఇప్పటివరకు ఒక్క ఎన్టీఆర్ తో తప్ప మరో స్టార్ హీరో సినిమాలో నటించింది లేదు. అందుకే విజయ్ సినిమాలో హీరోయిన్ గా అంటే ఈ అమ్మడికి ఇది ఒక గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: