అందాల ముద్దుగుమ్మ సమంత గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సమంత అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో సమంతకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంత, అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది, గత కొద్ది కాలం క్రితమే వీరిద్దరికీ విడలులుఅయ్యాయి. నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత తన సినిమాలకు స్పీడ్ ను పెంచింది, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్న సమంత మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది.
ఇప్పటికే తెలుగులో శాకుంతలం సినిమాను పూర్తి చేసిన సమంత 'యశోద' సినిమాలో నటిస్తోంది, అలాగే సమంత ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతోంది, అలాగే పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు కూడా సమంత ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి, అయితే ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత కు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక క్రేజీ ఆఫర్ వచ్చినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్తీ యంగ్ డైరెక్టర్ సతీష్ సెల్వ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు, అయితే ఇందులో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర బృందం అనుకుంటుందట, అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.