బాలయ్య కాదన్నాడా.. అనిల్ మరో సినిమా!!
ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసి భారీ స్థాయిలో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి తో ఏ హీరో అయినా సినిమాకి నో చెప్పడు. ప్రస్తుతం చేస్తున్న ఎఫ్ 3 సినిమా కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి సినిమా బాలకృష్ణ చేయాలని భావించి ఇప్పుడు బాలకృష్ణ డేట్స్ ఖాళీగా లేకపోవడం ఆయన మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడట. ప్రస్తుతం చేస్తున్న గోపీచంద్ మలినేని సినిమాకు ఆయన భారీ స్థాయిలో డేట్స్ కేటాయించాడు.
దాంతో అనిల్ రావిపూడి తో సినిమా మొదలు పెట్టాలంటే కొన్ని నెలలు అయినా ఆ దర్శకుడు ఆగాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎఫ్ 3 సినిమా పూర్తి చేసిన తరువాత ఆయన ఖాళీగా ఉండడం ఇష్టంలేక బాలకృష్ణ సినిమా మొదలు పెట్టే సమయానికి ముందు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని ఆయన భావిస్తున్నాడట. తొందర్లోనే ఎఫ్ 3 సినిమాను విడుదల చేసి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమానే మొదలుపెట్టి దాన్ని కూడా విడుదల చేసిన తర్వాత బాలకృష్ణ తో చేతులు కలుపుతాడు అని తెలుస్తుంది. మరి నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమాను ఇంకా మొదలు పెట్టనీ నేపథ్యంలో త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని అభిమానులు చెబుతున్నారు.