షాక్: మేజర్ మూవీ మరొకసారి పోస్ట్ పోన్ కానుందా..!!
ఇకపోతే పరిస్థితులు క్రమక్రమంగా అదుపులోకి వస్తున్న నేపధ్యంలో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ తేదీలను ఖరారు చేస్తూ వస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాను మార్చి 18వ తేదీ లేదా ఏప్రిల్ 28వ తేదీ రిలీజ్ చేస్తామంటూ సినిమా మేకర్స్ ప్రకటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాని కూడా మార్చి మొదటి వారంలో లేదా రెండవ వారం వీకెండ్ లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక తేదీలను కూడా ప్రకటించనున్నారు సినిమా మేకర్స్.
పెద్ద సినిమాల కారణంగా అడవిశేషు సినిమాకు పెద్ద కష్టం వచ్చి పడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే మేజర్ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ రిలీజ్ డేట్ ని ప్రకటించకపోవడంతో పెద్ద సినిమాలు ఆ తేదీలను ఖరారు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు.. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడం జరిగింది. కానీ వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ ఉండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే మేజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని మాత్రం ప్రకటించడం లేదు.