భీమ్లా నాయక్ : ట్రైలర్ రిలీజ్.. ఎప్పుడంటే..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్లో యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనున్ కోషియం అనే చిత్రానికి ఇది తెలుగు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రీమేక్ కి  స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పు లేదని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ ట్రైలర్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ మేరకు ఫిబ్రవరి మొదటి వారంలో భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు భీమ్లా నాయక్ ఓవర్సీస్ లోనూ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

విడుదలకు ఒక రోజు ముందు అనగా ఫిబ్రవరి 24న అమెరికాతో పాటు మరి మరి కొన్ని దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ఉండబోతున్నాయట. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పాటలకి విశేషమైన స్పందన లభించగా..భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ అందుకుంటాడాని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ,రానా  ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండబోతునట్లు తెలుస్తోంది. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్.. అలాగే దగ్గుబాటి రానాకు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: