బాలయ్యతో అల్లు అరవింద్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

Anilkumar
తెలుగు ప్రముఖ ఓటీటీ 'ఆహా' కోసం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నందమూరి బాలకృష్ణ తో 'అన్ స్టాపబుల్' అనే షోని హోస్ట్ చేయడం జరిగింది. ఈ షో కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు బాలయ్యతో ఏకంగా ఓ భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు అల్లు అరవింద్. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయమై కొంత మంది దర్శకులతో అల్లుఅరవింద్ చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నందమూరి కళ్యాణ్ రామ్ తో 'భీంబిసారా' అనే భారీ పీరియాడికల్ సినిమా చేసిన డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్టోరీ కూడా రెడీ అయినట్లు సమాచారం. ఓ పోలీస్ అధికారి అవినీతి రౌడీయిజాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. అయితే కథ అల్లు అరవింద్ కి బాగా నచ్చడంతో తాజాగా దర్శకుడికి ఐదు లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ కథను బాలయ్యకు వినిపించి ఓకే చేయించాలని ప్రయత్నంలో అల్లు అరవింద్ ఉన్నారని సమాచారం. ఇక భీంబిసారా పార్ట్ 2 షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉండే అవకాశాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ బాబు తో సినిమా చేయాలని ముందు ప్లాన్ చేశారు అల్లు అరవింద్. కానీ అది కుదరలేదు.

అందుకే ఇప్పుడు బాలయ్యతో సినిమా అనుకుంటున్నాడు. మరి అల్లు అరవింద్ కి నచ్చిన ఈ కథ బాలయ్యకు నచ్చుతుందా? ఒకవేళ నచ్చితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతోంది? అనే వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మరోవైపు బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోసారి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు బాలయ్య...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: