'నేను లోకల్' సినిమాని మిస్ చేసుకున్న మెగా హీరో ఎవరో తెలుసా..?

Anilkumar
నాచురల్ స్టార్ నాని హీరోగా త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన 'నేనులోకల్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాత దిల్ రాజుకు, బెక్కెం వేణుగోపాల్ కు భారీ లాభాలను అందించింది. అంతే కాదు నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో నేను లోకల్ కూడా ఒకటని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమాలో కామెడీ తో పాటు మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. 

అయితే ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' చాలామంది డబ్బు ఉంటే చాలు అని భావించి సినిమారంగంలోకి వస్తున్నారని, కానీ నిర్మాతకు కథను ఎంపిక చేసుకునే విధానం ఉండాలని అన్నారు.సినిమాని ప్రమోట్ చేసే సత్తా బిజినెస్ చేసే సామర్ధ్యం ఉండాలి. డబ్బు ఒకటే ఉంటే సినిమా రంగంలో సక్సెస్ కావచ్చు అని భావించడం కరెక్ట్ కాదని అన్నారు. తాను ఎంచుకునే కథల్లో ఎవరు ఆ పాత్రకు సూట్ అవుతారో వాళ్లను మాత్రమే ఆ పాత్రకు ఎంపిక చేస్తానని బెక్కెం వేణుగోపాల్ అన్నారు. కథను నమ్మే తాను ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే నేను లోకల్ సినిమా కోసం మొదట నానితో కాకుండా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని అనుకున్నామని. కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్ అవ్వలేదని.. ఆ తర్వాత నాని ని ఒప్పించడం.. వెంటనే సినిమా పట్టాలు ఎక్కడం జరిగిందని బెక్కం వేణుగోపాల్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు తాను నిర్మాతగా వ్యవహరించిన 'సినిమా చూపిస్త మామ' సినిమాకి కూడా మొదట రాజ్ తరుణ్, అవికా గోర్ హీరోహీరోయిన్లు కాదని, సినిమా ఓపెనింగ్ తర్వాత వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగిందని వేణుగోపాల్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ వార్త తెలిసిన మెగా ఫ్యాన్స్ మాత్రం సాయి తేజ్ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్నాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: