చిన్న హీరోలకు షాక్ ఇచ్చిన బంగార్రాజు..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాల సందడి కనిపిస్తూ ఉండేది, అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల మధ్య పోటీ ఉండేది,  జనాలు కూడా సంక్రాంతి పండుగ సమయంలో స్టార్ హీరోల సినిమాలను థియేటర్ లలో చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. కానీ ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు లేవనే చెప్పాలి, మొదట సంక్రాంతి పండుగకు టాలీవుడ్ స్టార్ హీరోలలో కొంత మంది తమ సినిమా విడుదల తేదీలను ప్రకటించారు,  కాకపోతే సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండటం, అలాగే అనేక రాష్ట్రాలలో థియేటర్ లపై ఆంక్షలు విధించడంతో పాన్ ఇండియా సినిమాలు అయినా ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్ సినిమాలు సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాయి,  దానితో ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన బంగార్రాజు సినిమాను మినహాయిస్తే అన్ని చిన్న సినిమాలే థియేటర్ ల వద్ద సందడి చేస్తున్నాయి.

 ఈసారి బంగార్రాజు సినిమాతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి రౌడీ బాయ్స్,  హీరో, సూపర్ మచ్చి సినిమాలు విడుదలయ్యాయి.  అయితే అందరూ అనుకున్నట్టుగానే మొదటి నుండి బంగార్రాజు సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది,  అలాగే రౌడీ బాయ్స్,  హీరో,  సూపర్ మచ్చి సినిమాలకు బంగార్రాజు రేంజ్ లో ఆదరణ లభించడం లేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు,  ఇలా బంగార్రాజు సినిమా వల్ల  చిన్న సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర  పెద్ద షాకే తగిలింది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే బంగార్రాజు సినిమా విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: