సరికొత్త అవతారంలో బన్నీ.. బాలయ్య, ఎన్టీఆర్ బాటలోనే..?

Anilkumar
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు నేషనల్ వైడ్ గా మార్మోగిపోతోంది. పుష్ప సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్నాడు ఈ అల్లు వారి అబ్బాయి. పుష్ప రాజ్ గా తన అద్భుతమైన నటనతో సినిమాను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు అల్లు అర్జున్. ఇక ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్న ట్లు తెలుస్తోంది. నటుడిగా కొన్ని కోట్ల మందిని ఆకట్టుకున్న నటసింహం బాలకృష్ణ.. ఆహా ఓటీటీ ద్వారా ఓటీటీ ద్వారా ఓ టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ టాక్ షో తో బాలకృష్ణ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నారు.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే దారిలో నడవబోతున్నట్లు తెలుస్తోంది. ఆహా వేదికగా ప్రసారమయ్యే ఓ స్పెషల్ షో లో అల్లు అర్జున్ హోస్ట్గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ షో కి అనూహ్యమైన స్పందన రావడంతో ఆహా మేకర్స్ మరొక స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి అల్లుఅర్జున్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నాడట. ఇప్పటికే తన తోటి స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాల్టీ షో తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు బన్నీ కూడా అదే దారిలో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఎటువంటి సందేహం లేదు. అయితే ఆహా ఓటీటీ అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించింది కాబట్టి కచ్చితంగా అల్లు అర్జున్ ఆహా కోసం హోస్ట్గా వ్యవహరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూర్తి స్పష్టత రావాలి అంటే ఆహా నిర్వాహకులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: