హరీష్ శంకర్ మరో మెగా కాంబో ఫిక్స్.!
ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమా చేశాడు హరీష్ శంకర్. ఆ సినిమా కూడా కమర్షియల్ గా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమా చేశాడు ఈ డైరక్టర్. ఆ సినిమాతో కూడా మెగా హిట్ అందించాడు. ప్రస్తుతం మరోసారి గబ్బర్ సింగ్ కాంబోలో భవధీయుడు భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ లాంటి పవర్ ప్యాక్డ్ హిట్ ఇచ్చాక ఆ కాంబో రిపీట్ అవుతున్న సందర్భంగా అంచనాలు భారీగా ఉంటాయి.
అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ మెగా హీరోతోనే హరీష్ శంకర్ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో హరీష్ శంకర్ సినిమా ఉంటుందని టాక్. హరీష్ శంకర్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ తో హిట్ కాంబో అనిపించుకోగా మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. విలక్షణ పాత్రలతో.. ప్రత్యేకమైన సినిమాలతో మెగా ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులను అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గని, ఎఫ్3 సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు అనుకున్న టార్గెట్ తో హిట్ అయితే మాత్రం వరున్ తేజ్ లెవల్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.