ఆ ముద్దు అనుపమ దశ నే మార్చేసింది!!
కొంతమంది హీరోయిన్లు అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని సినిమాలు చేయగా వారు టాప్ హీరోయిన్ లు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు కలిసి రావడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో ఆమె కనబరిచిన నటనకు ఫిదా అయిన ప్రేక్షకలోకం ఆమెకు భారీ పాపులారిటీ వచ్చేలా చేసింది.
అయితే ఈమె మొదటి నుంచి కూడా ఎటువంటి గ్లామర్ షో చేయకుండా సినిమాలలో నటించడం వల్ల మీడియం రేంజ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. అనుపమ పరమేశ్వరన్ ను పెద్ద హీరోలు ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఏమనుకుందో ఏమో తనకు పెద్ద సినిమాల అవకాశాలు రావాలంటే గేర్ మార్చాల్సిందే అని ఎవరు చెప్పారో ఏమో కానీ గత రెండు మూడు సినిమాలు గా ఆమె హద్దులు దాటి గ్లామర్ షో చేస్తుంది. ఇటీవలే రౌడీ సినిమాలో ఆమె ఇచ్చిన లిప్ లాక్ కూడా ఆమెకు బాగా ఉపయోగపడింది అని చెప్పాలి. ఓ కొత్త హీరో కు లిప్ లాక్ ఇవ్వడం ఇంతవరకు ఏ పేరున్న హీరోయిన్ ఇవ్వలేదనే చెప్పాలి. అయితే అదే ఆమెకు కలిసి వచ్చింది. గ్లామర్ షో తో పాటు లిప్ లాక్ లు షురూ చేసిన ఈమెను కొంతమంది తమ సినిమా లలో పెట్టుకునే ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కి మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయట.