అనూప్ స్థాయి ఇకనైనా పెరిగేనా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సంగీత దర్శకుల్లో ఒకరైన అనూప్ రూబెన్స్ చిన్న బడ్జెట్ సినిమాల సంగీత దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. పెద్ద హీరోలకు సైతం సంగీతం సమకూరుస్తూ వారి అభిమానుల అభిమానాన్ని చూరగొన్న ఈ సంగీత దర్శకుడు అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగెందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విధంగా ఇటీవలే ఆయన సంగీతం అందించిన బంగార్రాజు చిత్రం సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయ్యింది. సంగీత పరంగా కూడా ఈ సినిమాకు మంచి పేరు ప్రఖ్యాతులు దక్కాయి.

పాటలు మిలియన్ ల వ్యూస్ అందుకుని ఇప్పటికే హిట్ ఆల్బంగా నిలవగా నేపథ్య సంగీతానికి కూడా మంచి పేరు వచ్చింది సినిమా కి. అంతే కాదు టాలీవుడ్ లో దేవిశ్రీ ప్రసాద్ మరియు తమన్ ల తరువాత మూడవ సంగీత దర్శకుడి ఆప్షన్ గా అనూప్ రూబెన్స్ ఆ ప్లేస్ ను దక్కించుకోవడం విశేషం. పెద్ద హీరోలతో పెద్ద దర్శక నిర్మాతలతో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో వారిద్దరూ దొరక్కపోతే ఈ సంగీత దర్శకుడు తో సంగీతం చేయించుకుంటూ ఉంటారు మన మేకర్స్.

అయితే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలా రోజులనుంచి సంగీతం అందిస్తున్న కూడా ఎందుకో పెద్ద సినిమాల అవకాశాలు అరుదుగా వస్తున్నాయి ఈ సంగీత దర్శకుడికి. మీడియం రేంజ్ హీరోలకే సంగీతం సమకూరుస్తూ వాటితో హిట్స్ కొడుతున్నాడు కానీ పెద్ద సినిమాలకు మాత్రం సంగీతం అందించలేకపోతున్నాడు. పవన్ కళ్యాణ్, నాగార్జున వంటి పెద్ద హీరోలకు సంగీతం అందించిన అనుభవం ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిసారి దేవిశ్రీ తమన్ లకు మాత్రమే కాకుండా ఈ సంగీత దర్శకుడికి కూడా పెద్ద హీరోలకు పెద్ద సినిమాలకు సంగీతం అందించే అవకాశం ఇవ్వాలని ఆయన అభిమానులు దర్శక నిర్మాతలను కోరుతున్నారు. మరి ఈ కొత్త ఏడాది ఆయనకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: