ఒమైక్రాన్ పరిస్థుతుల మధ్య లాభాల బాటలో ప్రభాస్ !

Seetha Sailaja
ఒమైక్రాన్ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోతోంది. విడుదలకు రెడీగా ఉన్న ఎన్నో భారీ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరిస్థితితుల మధ్య ఆమూవీ నిర్మాతలు వడ్డీల భారంతో కృంగిపోయారు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవ్వడమే కాకుండా ఒక వీరాభిమాని తాను ఆత్మాహుతి చేసుకుంటాను అంటూ నిరాశలోకి వెళ్ళిపోయాడు అన్న వార్తలు వింటుంటే ప్రభాస్ ఎంత నిరాశకు లోనయ్యాడు అన్న అంచనాలు వేయడం మొదలుపెట్టారు.

అయితే ఈకరోనా థర్డ్ వేవ్ పరిస్థితులను ప్రభాస్ చాల తెలివిగా తనకు ఉపయోగపడే విధంగా మార్చుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ థర్డ్ వేవ్ పరిస్థితులతో సినిమా షూటింగ్ లు ఆగిపోతే ఏమాత్రం నిరాశ పడకుండా ప్రభాస్ మరొక మార్గాన్ని ఎంచుకోబోతున్నట్లు టాక్.

ప్రభాస్ భవిష్యత్ లో నటించబోయే సినిమాలకు సంబంధించి అనేక కథలు వింటూ ఈ థర్డ్ వేవ్ లో అనేకమంది యంగ్ డైరెక్టర్స్ చెప్పే కథలు వినాలని ప్రభాస్ ఒక స్థిరనిర్ణయంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పెండింగ్ లో ఉన్న కొన్ని వ్యాపార వ్యవహారాలకు సంబంధించి లోతుగా ఆలోచించి వాటి విషయంలో కూడ ఒక నిర్ణయానికి రావాలని ప్రభాస్ ఆలోచన అని అంటున్నారు.

థర్డ్ వేవ్ కొంతవరకు అదుపులోకి వచ్చిన తరువాత ప్రభాస్ తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా దేశంలోని ప్రముఖ నగరాలలోని కొన్ని ప్రముఖ ధియేటర్ల దగ్గరకు వెళ్ళి ఆగిపోయిన ‘రాధే శ్యామ్’ ప్రమోషన్ ను తిరిగి ప్రారంభించి ఈమూవీ పై మళ్ళీ మ్యానియా వచ్చేలా ప్రయత్నాలు చేస్తాడని తెలుస్తోంది. సుమారు మూడు సంవత్సరాల నుండి ప్రభాస్ నుంచి సినిమాలు రాకపోవడంతో అసహనంతో ఉన్న అభిమానులకు బహుమతిగా ఈ సంవత్సరం ప్రభాస్ తన వైపు నుండి రెండు సినిమాలు విడుదల అయ్యేలా పక్కా ప్లాన్ లో అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అభిమానులు ఖుషీ అవుతూ థర్డ్ వేవ్ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: