హీరోగా సింగర్ సిద్ శ్రీరామ్‌.. డైరెక్టర్ ఎవరంటే..??

N.ANJI
చిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన గాత్రంతో ప్రేక్షలను కట్టిపడేసారు. ఆయన పాడే ఒక్కో పాట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఇప్పుడు సిద్ శ్రీరామ్‌కు కూడా అంతే క్రేజ్ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే శ్రీరామ్ పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అవుతున్నాయి. అంతేకాదు.. సినిమా కంటెంట్ యావరేజ్‌గా ఉన్నా కూడా శ్రీరామ్ పాటలతో ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఒక్క విధంగా చెప్పాలంటే.. శ్రీరామ్ పాటలు సినిమాకు హైలెట్‌గా మారుతున్నాయి. ఇక శ్రీరామ్ తెలుగుతో పాటు తమిళ భాషల్లో పాపులర్ సింగర్‌ రాణిస్తున్నారు. అంతేకాక.. ఈ రెండు భాషల్లో స్టార్ హీరోలు అందరూ తమ సినిమాల్లో శ్రీరామ్ ఒక్క పాట అయినా పాడాలని పట్టుబడుతున్నారని సమాచారం. దీంతో శ్రీరామ్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆయన పాట పాడే విధానంలో ఓ విధమైన ఫీల్ ఉంటుంది.
ఆయన పాడిన పాటలన్ని మనస్సుకు హత్తుకునేలా ఉంటాయి. అయితే  సిద్ శ్రీరామ్ చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. ఇక శ్రీరామ్ హీరోగా కూడా ట్రై చేసుకోవచ్చని ఇప్పటికే చాలా మంది సజెషన్లు చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు.. శ్రీరామ్ వెండితెర ఎంట్రీ కోలీవుడ్ నుంచి జరగబోత్తునట్లు సమాచారం. ఇక మణిరత్నం దర్శకత్వంలో శ్రీరామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందన్న ప్రచారం అయితే బలంగా వినపడుతుంది.
ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడల్ సినిమాతో శ్రీరామ్ కోలీవుడ్‌కు సింగర్‌గా పరిచయమైయ్యారు. అయితే ఇప్పుడు అదే మణిరత్నం దర్శకత్వంలో మనోడు వెండితెర హీరోగా రాబోతున్నట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే మణిరత్నం - శ్రీరామ్ మధ్య కథాచర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. అంతేకాదు.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న పొన్నియిన్ సెల్వన్ సినిమా పూర్తయిన వెంటనే ఈ క్రేజీ కాంబోలో సినిమా పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: