చరణ్.. చైతు.. తారుమారవుతున్న సినిమాలు!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో హీరో లకు కుదరకపోవడం వల్ల ఆల్రెడీ కమిట్ అయిన దర్శకుల సినిమాలు తారుమారు అవుతున్నాయి.  అల్లు అర్జున్ హీరో గా కొరటాల శివ సినిమా చేయాల్సి ఉంది కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ తో సినిమా చేయడం ఇప్పుడు ఆ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదు అన్న సందేహానికి పునాదులు వేస్తుంది. అలాగే ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉండగా దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరీ ఈ సినిమాను చేస్తున్నాడు.

 మరోవైపు త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా ఓకే చేసుకోవడం చూస్తుంటే ఇది అంతా పక్కా ప్లాన్ తోనే జరిగింది అని తెలుస్తుంది. దీని వెనుక ఉన్న విషయాలు బయటకు పెద్దగా రాలేదు కానీ హీరోలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరో కోసం తన సినిమాల పట్ల కొంత అడ్జస్ట్మెంట్ లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల చేస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలోని సినిమాను చేయనున్నాడు.

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మరియు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోని సినిమాలలో చేయనున్నాడు చరణ్. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి నాగచైతన్యతో ఓ సినిమా కమిట్ మెంట్ ఉండగా ఆ సినిమాని పరిష్కరించే క్రమంలో గౌతమ్ తిన్ననూరి సినిమాను కొన్ని రోజులు నాగచైతన్య కోసం పోస్ట్ ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది చరణ్. ఈ లోపు శంకర్ సినిమా పూర్తి చేస్తాడు రామ్ చరణ్. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి తో చేతులు కలుపుతాడు. నాగచైతన్య లాంటి హీరో కోసం రామ్ చరణ్ లాంటి పెద్ద స్థాయి హీరో ఈ విధంగా ఆలోచించడం నిజంగా మంచి పరిణామం అనే చెప్పాలి. నాగచైతన్య ప్రస్తుతం బంగార్రాజు చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. 




 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: