వావ్:నా జీవితంలో గుర్తుండిపోయే సాంగ్ ఆదే:కృతి శెట్టి..!!

Divya
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి అందరూ కలిసి నటించిన తాజా చిత్రం బంగార్రాజు.. ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.. దీంతో ఈ సినిమాని వీలైనంత ఎక్కువ గా ప్రమోట్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నారు.. అందుకోసమే నిన్నటి రోజున ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరిపారు.. ఇక ఈ కార్యక్రమంలో కథానాయకి కృతి శెట్టి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది వాటి గురించి చూద్దాం.

కృతి శెట్టి మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం.. తాజాగా విడుదలైన బంగార్రాజు పాటకు మంచి ఆదరణ లభించింది.. ఇక ఎంతో ఆనందంగా ఉన్నది ఇదే నా ఫస్ట్ డాన్స్ సాంగ్ అంటూ తెలియజేసింది.. ఇక అంతే కాకుండా ప్రేక్షకులు కూడా ఈ పాటను బాగా ఆచరించడంతో ఇది నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తోంది అని తెలియజేసింది. ఈ పాటను పాడిన మధుప్రియ గారికి కృతజ్ఞతలు తెలియజేసింది కృతి శెట్టి. ఈ పాటను నాకు గుర్తుండిపోయేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేసింది.

ఇక బంగార్రాజు ఆల్బమ్ సాంగ్స్ వింటే మాకు వాసి వాడి తస్సాదియ్య అని చెప్పాలని అనిపిస్తోంది.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం చాలా కష్టపడ్డారు అనేది మాకు తెలుసు. ముఖ్యంగా సీనియర్ నటులు నాగార్జున , రమ్యకృష్ణ లాంటి నటులతో పనిచేయడం నా అదృష్టంగా ఫీలవుతున్నాను చిత్ర యూనిట్ తో సహా ఈరోజు వేదికపై పర్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ తెలిపింది..

గత నాలుగు సంవత్సరాల క్రితం రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా ఈ బంగార్రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ , జీ స్టూడియోస్ వారు  సంయుక్తంగా నిర్మిస్తూ.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. జనవరి 14 వ తేదీన చాలా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: