సినిమా సంక్రాంతి : పండగ లాంటి సినిమా వచ్చేస్తుంద్రోయ్.. రా రా బంగార్రాజు
మాకింకెవ్వడు కొనిపెడ్తడు
కోకా గ్లౌజు అన్న పాటతో
దర్శకులు కల్యాణ కృష్ణ
భలే మాస్ నంబర్ రాశారు
అసలీ పాటతోనే సినిమాకు హైప్
పెరిగిపోయింది..
ఆ పాట నుంచి ఇప్పుడు విడుదల కానున్న మరో రెండు పాటల వరకూ ఆ పాటల పాలవెల్లి కాంతులు పంచుతూనే ఉంది. బంగార్రాజు జోరును ఆ జోడీ మరింత పెంచేసింది..డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ పెయిర్ భలే కుదిరింది మళ్లీ అనేంతలా ప్రతి పాటా ఉంది.చాలా రోజుల తరువాత ఓ ఆల్బమ్ లో పాటలన్నీ హిట్ కావడం కూడా సినిమాకు ఓ పాజిటివ్ బజ్. ఇవన్నీ మ్యూజికల్ ఈవెంట్ స్థాయిని మరింత పెంచేశాయి.. సాహిత్యం రాసిన ప్రతి ఒక్కరికీ నాగ్ ధన్యవాదాలు చెప్పి సాహిత్యం ఉంటుంది మేం లేకపోయినా మనం లేకపోయినా, సంగీతం ఉంటుంది మేం లేకపోయినా మనం లేకపోయినా అని చెబుతూ... మూడు తరాల పాటలను గుర్తు చేసుకున్నారు ఆయన.
బంగార్రాజు సినిమాకు అంతా సిద్ధంకండి..పండగలాంటి సినిమా అంటున్నారు..పెద్ద పండుగకు ఆనందాలు తీసుకువచ్చే పండుగ ..అందుకే ఈ సినిమా మరో సోగ్గాడు చిన్ని నాయనా అంత హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు మ్యూజికల్ ఈవెంట్ లో నాగార్జున.మా సినిమా పాటలకు సాహిత్యం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో లిరిసిస్ట్స్ భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, బాలాజీ సందడి చేశారు. ఆరు పాటలున్న ఈ ఆల్బమ్ చివరి పాటకు సంబంధించి పల్లవి మాత్రం ఆలపించారు సంగీత దర్శకులు అనూప్,మరో సింగర్ సాహితీ చాగంటి.ఈ వేడుకల్లో ప్రతీ పాట ఆలపించిన ప్రతీసారి ఎంతో స్పందన వచ్చింది ప్రేక్షకుల నుంచి..పరిమిత సంఖ్యలోనే ఈ వేడుక నిర్వహించినా ఆద్యంతం ఆకట్టుకున్నారు అనూప్ తన సంగీతంతో!
అందాల తారలు ఫరీదా,కృతిశెట్టి,దక్ష వేదికపై భలే సందడి చేశారు. వేడుకల్లో నాగ్, చైతన్య, కృతిశెట్టితో స్టెప్పులు వేయించారు అనూప్. అదేవిధంగా నాగ్ తో ఈలలు కొట్టించి, కృతి, చై జంటతో రిథమ్ ప్లే చేయించారు..అప్పటికప్పుడు గాజుల సవ్వడితో కృతి,సాము గారడీ చేసే కర్రతో చై బీట్-ను ప్లే చేస్తూ పోతూ ఉంటే..ఆ ధ్వనికి అనుగుణంగా అనూప్ డ్రమ్స్ ప్లే చేశారు. నాగ్ ఈలలతో మోత మోగించారు. అక్కినేని అభిమానుల్లో గొప్ప సంతోషం నింపారు. ఏదేమయినా వాసివాడి తస్సాదియ్యా పిల్ల జోరు అదిరిందయ్యా! వాసివాడి తస్సాదియ్యా దీని స్పీడుకు దండాలయ్యా!