క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది..!

shami
సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో కథానాయికల సోయగాలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా వచ్చాక తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఆకట్టుకునేలా వారి హంగామా సాగుతుంది. కొందరు తమ క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లని ఆకట్టుకుంటుంటే.. కొందరు హాట్ లుక్స్ తో ఆడియెన్స్ ని డిస్ట్రబ్ చేస్తారు. సినిమాలో కన్నా సోషల్ మీడియాలో రెచ్చిపోయే భామలు ఉన్నారని చెప్పొచ్చు. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా కొత్త హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ కూడా చేరింది.

నాని గ్యాంగ్ లీడర్ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు.. ఆ తర్వాత్ శర్వానంద్ తో శ్రీకారం సినిమా లో కూడా నటించింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆఫర్లు అందుకుంటుంది ప్రియాంకా. తమిళం లో ఈమధ్యనే శివ కార్తికేయన్ తో నటించిన వరుణ్ డాక్టర్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కాంబో హిట్ అవడంతో మళ్లీ అతనితోనే డాన్ సినిమా చేస్తుంది ప్రియాంకా అరుల్ మోహన్. ఆ సినిమాతో పాటుగా తమిళం లో సూర్య హీరోగా వస్తున్న మరో సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుంది.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాం లో తన క్యూట్ లుక్స్ తో ఫోటో షూట్ చేసింది ప్రియాంకా. గ్లామర్ షోకి దూరమని మొదటి నుండి చెప్పుకునే ఈ అమ్మడు ఫోటో షూట్ లో కూడా క్యూట్ లుక్స్ తోనే ఆకట్టుకుంటుంది. తెలుగులో చేసిన రెండు సినిమాలకు ప్రియాంకాకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఒక్క సూపర్ హిట్ పడితే ప్రియాంకా తెలుగు కెరియర్ సెట్ రైట్ అయ్యే అవకాశం ఉంది.  ఆ ఒక్క అవకాశం కోసం ప్రియాంకా చాలా ఈగర్ గా ఎదురుచూస్తుంది. తమిళంలో అమ్మడి కెరియర్ దూకుడు మీద ఉండగా తెలుగులోనే తన సత్తా చాటాలని చూస్తుంది ప్రియాంకా.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: