తెర‌పై అస్స‌లు మ్యాచ్ కాని హీరో-హీరోయిన్ జంటలు ఇవే!

VUYYURU SUBHASH
సినీ ఇండ‌స్ట్రీలో ఆన్ స్క్రీన్‌పై బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న హీరో, హీరోయిన్లు ఎంద‌రో ఉన్నారు. ముఖ్యంగా కొన్ని జోడీలు తెర‌పై క‌నిపిస్తే.. ఇక ఆ సినిమా హిట్టే అన్న న‌మ్మ‌కం సినీ ప్రియుల‌కు ఉంటుంది. అయితే వెండితెర‌పై బెస్ట్ ఒక్క‌టే కాదు.. అస్స‌లు మ్యాచ్ కాని హీరో-హీరోయిన్ జంట‌లు కూడా ఉన్నాయి. ఆ జంట‌లు ఏవి..? వారు ఏయే సినిమాల్లో న‌టించారు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌హేష్ బాబు-అనుష్క‌.. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన చిత్రం `ఖలేజా`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ఈ చిత్రంలో మ‌హేష్‌కి జోడీగా అనుష్క ఏ మాత్రం సెట్ కాలేదు. ఈ విష‌యంపై అప్ప‌ట్లో మ‌హేష్ అభిమానులే పెద‌వి విరిచారు.

వెంక‌టేష్‌-జెనీలియా.. ఆన్ స్క్రీన్‌పై ఫ్లాప్‌గా నిలిచిన జోడీల్లో వీరిది ఒక‌టి. వెంకీ హీరోగా కె. రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `సుభాష్ చంద్రబోస్` సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా న‌టించింది. కానీ, ఈ మూవీలో హీరోకి జెనీలియా కూతురిలా క‌నిపించింద‌ని అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

రజినీ కాంత్-అనుష్క‌.. తెర‌పై ఏ మాత్రం మ్యాచ్ కాని జంట‌ల్లో వీళ్ల‌ది ఒక‌టి. రజినీ కాంత్, అనుష్క‌లు క‌లిసి కె. ఎస్. రవి కుమార్ డైరెక్ష‌న్‌లో `లింగ` సినిమాలో న‌టించారు. కానీ, ఈ జోడీ ప్రేక్ష‌కులు ఆక‌ట్టుకోవ‌డంలో పూర్తిగా విఫ‌లం అయింది.

 బాలకృష్ణ-కత్రినా కైఫ్.. వీరిద్ద‌రూ `అల్లరి పిడుగు` సినిమాలో జంట‌గా న‌టించారు. కానీ, వీరి జోడీ వెండి తెర‌పై ఏ మాత్రం సెట్ అవ్వ‌క‌పోవ‌డంతో నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేశారు.

చిరంజీవి- త్రిష.. ఎ.ఆర్. మురుగ దాస్ తెర‌కెక్కించిన `స్టాలిన్‌` చిత్రంలో వీరిద్ద‌రూ జోడీగా న‌టించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2006లో విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌మే సాధించినా.. చిరంజీవి స‌ర‌స‌న త్రిష అస్స‌లు సూట్ కాలేద‌ని ప్ర‌చారం జ‌రిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: