నితిన్ భార్యకు కరోనా.. కానీ బర్త్ డే సెలబ్రేట్ చేసిన హీరో?
అయితే తన భార్య షాలిని పై నితిన్‌కు ఎంత ప్రేమ ఉంది అన్న విషయం ఇక్కడ జరిగిన ఘటనతో తెలిసిపోతుంది. ఇటీవలి కాలంలో కరోనా అందరిని భయపెడుతుంది. ఇక వైరస్ బారిన పడిన వారు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఎవరూ కూడా వైరస్ బారిన పడిన వారి దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడి పోతున్నారు. వారి గురించి కూడా కాస్త ఆలోచించరూ లేదు. అయితే ఇటీవలే హీరో నితిన్ భార్య కరోనా వైరస్ బారిన పడిందన్న విషయం తెలిసిందే. దీంతో ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటుంది. దీంతో అంతలోనే శాలిని బర్త్ డే వచ్చేసింది. ఒక వేళ భార్య ఐసోలేషన్ లేకపోయి ఉంటే బర్త్ డే ఘనంగా సెలబ్రేట్ చేసేవాళ్ళం.. ఇప్పుడు ఏం చేయాలబ్బా అని నితిన్ బాగా ఆలోచించి ఉన్నట్టున్నాడు.
ఇంతలో అతనికి ఒక జబర్దస్త్ ఐడియా తట్టింది. దీంతో ఐసోలేషన్ లో ఉన్న భార్యను సంతోష పెట్టేందుకు వినూత్నంగా బర్త్ డే సెలబ్రేషన్ ప్లాన్ చేశాడు. ఇక కరోనా వైరస్ బారిన పడటంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో లో ఉంది షాలిని. ఇక ఇంటి ముందు గార్డెన్ లో కేక్ కట్ చేసి భార్యకు బర్త్ డే విషెస్ చెప్పాడు నితిన్. ఇక కిటికీలోనుంచి ఇదంతా చూస్తూ శాలిని ఎంతగానో మురిసిపోయింది. కరోనా కే అడ్డంకులు ఉంటాయి.. ప్రేమకు కాదు.. లైఫ్ లో మొదటిసారి నువ్వు నెగిటివ్ అవ్వాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ బర్త్ డే అంటూ చెప్పాడు నితిన్. దీనికి సంబంధించిన వీడియో కాస్త అఫ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.