ప్రేమ.. విరహం.. రెండు అనుభవించిన నయనతార..!
ఇక నయనతార పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార తన లైఫ్ లో అంతకుముందే ఇద్దరితో ప్రేమలో పడి బ్రేకప్ చెప్పింది. తమిళ స్టార్ హీరో శింబుతో నయనతార పీకల్లోతు ప్రేమలో పడ్డది. ఇద్దరు కలిసి చేసిన వల్లభ సినిమా టైం లో ఇద్దరి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. శింబుతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన నయనతార అతని ప్రేమ నుండి బయటపడేందుకు చాలా ఇబ్బంది పడ్డది. ఆ తర్వాత మళ్లీ ప్రభుదేవాతో నయనతార ప్రేమలో పడ్డది. వీళ్లిద్దరి రిలేషన్ కూడా దాదాపు పెళ్లి దాకా వెళ్లింది.
ప్రభుదేవతో పెళ్లి దాకా వెళ్లిన నయతార మళ్లీ అతనితో బ్రేకప్ చేసుకుంది. రెండు సార్లు ప్రేమలో పడటమే కాదు.. రెండు సార్లు విరహ వేదనని అనుభవించింది నయనతార. ఆ టైం లో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న నయనతార ఫుల్ ఫోకస్ సినిమాల మీద పెట్టింది. ఆ సంఘటనలే నయనతారని పూర్తిగా మార్చేశాయి. ఆమెని బలంగా మార్చి కెరియర్ మీద మరింత ఫోర్స్ గ వెళ్లేలా చేశాయి అప్పటి పరిస్థితులు. ఆ టైం లో ఆమెకు విఘ్నేష్ శివన్ పరిచయం అయ్యాడు. అతని డైరక్షన్ సినిమా చేయడం అతని అభిరుచులు నచ్చడంతో నయనతార అతనితో ప్రేమలో పడ్డది. కొన్నాళ్లుగా విఘ్నేష్ శివన్, నయన్ ప్రేమలో ఉన్నారు. వీళ్ల పెళ్లి గురించి ఫ్యాన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.