సురేష్ బాబు తాగకపోవడానికి కారణం ఆమెనా..??
అయితే అసలు విషయం ఏంటంటే.. సురేష్ బాబు నోటా నుంచి సినిమా బడ్జెట్, బాక్సాఫీస్ లెక్కలు, రిలీజ్ డేట్స్ తప్ప వేరే విషయాలు బయటికి రావు.. తన ధ్యాస మొత్తం సినిమాల పైన ,సినిమా సక్సెస్ పైన మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయన అంతగా సినిమాలతోనే మమేకం అయి పోతూ ఎప్పుడు చూసినా సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు
సురేష్ తండ్రి ప్రముఖ నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలోనే పెరిగిన ఈయన తన దృష్టిని కూడా సినిమాలపైనే ఉండేది. అయితే రామానాయుడు ముందు నుంచి తన కొడుకు సురేష్ బాబును హీరోగా చేయాలని అనుకున్నారంట. అందుకు ఆయన దిశగా ప్రయత్నాలు కూడా చేశారని సమాచరం.
ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణాన్ని చెప్పుకొచ్చారు. ఆయన చిన్నప్పటి నుండే కొన్ని విషయాలలో ఫిక్సై పోవడంతో నటన వైపు వెళ్ళలేదు అని చెప్పుకొచ్చారు. సురేష్ బాబు తాగకపోవడానికి ఓ రీజన్ ఉందంట.. అదేటంటే తన పిన్ని భర్తను చూసి జీవితంలో అలవాటుకు దూరంగా ఉండిపోయాను అని, తాగడం తోనే తన పిన్ని జీవితం కూడా నాశనం అయిపోయింది అని ..అందుకే అలాంటి అలవాట్లకు దూరంగా ఉన్నాను అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తను కట్టుకున్న భార్యకు అన్యాయం చేయకూడదని ఎవరితో ఎఫైర్లు పెట్టుకోలేదని ఆయన తెలిపారు.