ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నది కృతిశెట్టి. శ్యామ్ సింగరాయ్ తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు.కృతిశెట్టి నటించిన బంగార్రాజు మరియు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఈ ఏడాది రవిడుదల కావాల్సి ఉండగా ఈ సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయని తెలుస్తుంది.. యూత్ లో ఊహించని స్థాయిలో కృతిశెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా సినిమాసినిమాకు కృతిశెట్టికి క్రేజ్ మరియు పారితోషికం బాగా పెరుగుతోంది.
అందం, అభినయం అలాగే ప్రతిభ పుష్కలంగా ఉన్న కృతి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారట.. శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన కృతి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారని తెలుస్తుంది.శ్యామ్ సింగరాయ్ స్టోరీ వినే సమయంలోనే ఈ సినిమా రిజల్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నానని నాని గారి మాటలు విన్న తర్వాత ఈ సినిమా రిజల్ట్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని కృతి తెలిపారట.అమ్మతో కలిసి మాత్రమే తాను సినిమా కథలను వింటానని కథ విషయంలో అభిప్రాయాన్ని అమ్మతో పంచుకుని అమ్మకు నచ్చితే మాత్రమే ఆ సినిమాలో నేను నటిస్తానని కృతిశెట్టి వెల్లడించారట.
ఉప్పెన మరియు శ్యామ్ సింగరాయ్ సక్సెస్ సాధించడం సంతోషాన్ని కలిగిస్తోందని కృతి అన్నారట.. బేబమ్మ రోల్ కు దూరంగా ఉండే రోల్స్ చేయాలని అనుకున్న సమయంలోనే శ్యామ్ సింగరాయ్ లో కీర్తి వంటి రోల్ వచ్చిందని కృతి చెప్పుకొచ్చారట.కృతిశెట్టి దేనికి భయపడతారనే ప్రశ్న ఎదురు కాగా కృతి ఆ ప్రశ్నకు స్పందిస్తూ చిన్నప్పటి నుంచి కింద పడిపోతానేమోనని నాకు భయమని ఈ విషయంలో నన్ను అందరూ టీజ్ చేస్తుంటారని అన్నారు. బాల్యంలో పడిపోవడం వల్ల ఆ భయం అలా ఉండిపోయిందని కృతి పేర్కొన్నారట.
ప్రస్తుతం తాను విభిన్నమైన పాత్రలలో ఎక్కువగా నటిస్తున్నానని యాక్షన్ రోల్ చేయాలనే ఆసక్తి ఉందని కృతి వెల్లడించారట.. బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి పాత్రలో నాగచైతన్యకు కృతిశెట్టి నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.