
చిరంజీవికి ఇష్టమైన మెగా హీరో ఎవరో తెలుసా?
తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనగానే మొదట వినిపించే పేరే మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచిన చిరంజీవి అంటే ఇష్టం లేని వారు నచ్చని వారు బహుశా ఎవరు ఉండరేమో. అలాగే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి ఒక్క హీరోను అక్కున చేర్చుకుని అభిమానాన్ని పంచారు ప్రేక్షకులు. మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ప్రత్యేకం అదంతా చిరు వల్ల మొదలయ్యిందే. అయితే అందరికీ ఎంతో ప్రత్యేకమైన చిరుకి మెగా ఫ్యామిలీ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే....హీరో అయిన మరెవరైనా సరే తండ్రిగా మొదట తన పిల్లలనే ఎక్కువ ప్రేమిస్తారు, ఇష్టపడతారు అలాగే చిరుకి కూడా మొదట తన పిల్లలంటే పంచ ప్రాణాలు.
అయితే ఆ తరువాత మెగా ఫ్యామిలీలో ఇష్టపడేది అంటే అందరూ ఇష్టమే అయిన అందరికన్నా బన్నీ అంటే చిరుకి ప్రత్యేకమైన అభిమానం, ప్రేమట. చిన్నప్పటి నుండే అల్లు అర్జున్ ని కాస్త ప్రత్యేకంగా కాస్త ఎక్కువగా ప్రేమ చూపిస్తారట చిరు. బన్నీ చిన్నప్పటి నుండే కాస్త అల్లరి పిల్లాడట అందుకే చిరుకి కాస్త ఎక్కువ ఇష్టమని చెబుతుంటారు. అంతే కాకుండా తనలాగే డ్యాన్స్ లో పోటీగా చేసేవాడని ప్రత్యేకంగా చూస్తాడట. కానీ ఇప్పుడు వేరే వేరే కారణాల వలన అంత బంధం ఉన్నట్లు కనిపించడం లేదు.