పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా దగ్గుపాటి రానా సరసన కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది, ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది, అయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, దీంతో భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించబోతునట్లు అనేక వార్తలు వచ్చాయి, కాకపోతే భీమ్లా నాయక్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు చెప్పిన జనవరి 12 వ తేదీనే విడుదల చేస్తాము అంటూ చిత్ర బృందం తేల్చి చెప్పేసింది.
కాకపోతే చివరగా భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు, అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 7 వ తేదీన విడుదల చేయడం లేదు అని చిత్ర బృందం ప్రకటించింది, దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ సినిమాను ముందు చెప్పిన జనవరి 12 వ తేదీన విడుదల చేస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, కానీ అది కుదరడం కష్టం అని ఇండస్ట్రీ టాక్. దానికి ప్రధాన కారణం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి దీనితో ఈ సినిమా జనవరి 12 వ తేదీన రావడం కష్టం అని ఇండస్ట్రీలో ఒక టాక్ బలంగా వినబడుతుంది.