యోగా టీచర్ టు స్టార్ హీరోయిన్.. అనుష్క గురించి ఇది మీకు తెలుసా..!
అనుష్క పేరెంట్స్ పేర్లు ప్రఫుల్లా.. ఏ.ఎన్ విటల్ శెట్టి. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వారి పేరు గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి. యోగా టీచర్ గా చేస్తున్న అనుష్క ని చూసి పూరీ జగన్నాథ్ తను చేస్తున్న సూపర్ సినిమాకు సెలెక్ట్ చేశాడు. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరుని అనుష్క అని మార్చేశారు. కేవలం కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గానే కాదు ఫీమేల్ సెంట్రిక్ సినిమాల తో కూడా అనుష్క ది బెస్ట్ అనిపించుకుంది. బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత గ్యాప్ తీసుకున్న అనుష్క లేటెస్ట్ గా నవీన్ పొలిశెట్టి హీరోగా చేస్తున్న సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.
సైజ్ జీరో కోసం లుక్ విషయంలో తేడా కొట్టడం తో అనుష్క ఈమధ్య బయట కనిపించడం మానేసింది. అయితే అనుష్క ఇప్పుడు పూర్తిగా మునుపటి రూపానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఇక మీదట వరుస సినిమాలు చేస్తుందని అంటున్నారు. తప్పకుండా అనుష్క ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అనుష్క తిరిగి ఫాం లోకి వస్తే ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతారు.