వామ్మో:వివాహం పై క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి..!
సాయి పల్లవి గతంలో ఒక మాటను తెలియజేయడం జరిగిందట.. ఆ మాటను ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే సింక్ అవుతుంది అనే వార్త వినిపిస్తోంది. అదేమిటంటే సాయి పల్లవి వయస్సు 30 సంవత్సరాలు వచ్చాక తను వివాహం చేసుకుంటానని ఒక సందర్భంలో తెలియజేసినట్లు సమాచారం. అయితే ఆమె వయసు ఇప్పుడు 29 సంవత్సరాలు కాగా వచ్చే ఏడాది కి 30 సంవత్సరాల వయసు కలదు. దీంతో సాయి పల్లవి వివాహానికి సిద్ధమైనట్లే కదా అని కొంత మంది అనుకుంటూ ఉంటారు. దీనికి తోడుగా ఆమె వచ్చే ఏడాది ఎటువంటి సినిమాను ఒప్పుకోలేదు.. కేవలం ఆమె చేతిలో ఉన్నది ఒక్క విరాటపర్వం సినిమా తప్ప. అది కూడా సినిమా షూటింగ్ అంతా పూర్తి అయిపోయింది.
ఇక ఈ రెండు విషయాలను కంపార్ చేసి చూస్తే.. సాయి పల్లవి వివాహం జరగడం పక్క అని కొంతమంది నెటిజన్లు అనుకుంటున్నారు. ఒకవేళ వివాహం చేసుకున్నట్లయితే.. సినిమాలలో నటిస్తుందా లేదా అనే విషయం కూడా ఆమె అభిమానులకు సందిగ్ధంగా ఉన్నది. అయితే ఇక హీరోయిన్ నజ్రియా . కొద్దిరోజులు వివాహం చేసుకుని ఆ తర్వాత తిరిగి ఎంట్రీ ఇచ్చింది.. సాయి పల్లవి కూడా అలాగే చేస్తుందేమో చూడాలి.