అఖండ సీక్వెల్ పై స్పందించిన నిర్మాత..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో పూర్ణ, జగపతి బాబు ముఖ్య పాత్రలో నటించారు, అలాగే  శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు.  ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బాస్టర్ విజయంగా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా,  అఘోర గా రెండు పాత్రల్లో నటించాడు, ఈ రెండు పాత్రల్లో బాలకృష్ణ తనదైన శైలిలో నటించి జనాలను అలరించాడు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇది వరకు తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి, అలాగే వీరిద్దరి కాంబినేషన్ లి తెరకెక్కిన హైడ్రిక్ సినిమా అఖండ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది, ఇలా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అఖండ సినిమా గురించి ఈ సినిమా ప్రొడ్యూసర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.


అఖండ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు బోయపాటి శ్రీను గారి రాబోయే సినిమాల్లో నేను భాగస్వామిని అవుతానా ? లేదా ? నేను చెప్పలేను, ఇక  అఖండ సినిమాకి సీక్వెల్ తీయాలనే కోరిక నాకు కూడా ఉంది. ఒక వేళ అఖండ సినిమాను  హిందీ లో రీమేక్ చేయాలి అనుకుంటే ఇలాంటి పాత్రలకు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు అయితే చాలా బాగుంటుంది అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శితమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: